పకడ్బందీగా ఓటరు జాబితా | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓటరు జాబితా

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

వీర్నపల్లిలో పట్టపగలే చోరీ వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని వడ్లూరి రాజం ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన రూ.2లక్షలు, రెండు బంగారు పుస్తెలు, వెండి గొలుసులు, ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు ఇతర విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడు రాజం ఫిర్యాదుతో ఎస్సై వేముల లక్ష్మణ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

జ్యోతినగర్‌: ఓటరు జాబితాను పగడ్బందీగా తయారు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ ఆదేశించారు. ఎన్టీపీసీ పీటీఎస్‌ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం జరిగిన బీఎల్‌వోల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు జాబితా ఉండాలని సూచించారు. జాబితాలో ఉన్నవారు మరణించినా, ఇతర ప్రాతాలకు వలస వెళ్లినా వారిని గుర్తించి జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్లు రవీందర్‌ పటేల్‌, సునీత, లక్ష్మి, సీడీపీవో అలేఖ్య పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు నుంచిపడి యువకుడి మృతి

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని లెవల్‌ క్రాసింగ్‌గేట్‌ వద్ద ఆదివారం రాత్రి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలునుంచి పండి బిహర్‌ రాష్ట్రం ఖైమూరు బాబువ జిల్లా ఆసన్‌ గ్రామానికి చెందిన అఫరోజ్‌ అన్సారీ(21) మృతిచెందాడు. రామగుండం జీఆర్ఫీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతి కథనం ప్రకారం.. సూర్యాపేటలో కూలీ పనులు చేసేందుకు దీల్‌దయాల్‌ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్‌ నుంచి తన సోదరులతో కలిసి సంఘమిత్ర రైలులో ఖమ్మం ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలోని పొత్కపల్లిలో అఫరోజ్‌ అన్సారీ ప్రమాదవశాత్తు కిందపడి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. శవపరీక్ష చేయించి మృతుడి తమ్ముడికి అప్పగించారు.

ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య

మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి పరిధి ఎస్సారెస్పీ కాలువలో దూకి మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోని తుమ్మచెట్టుకు మహిళ మృతదేహం కనిపించిందన్న బాటసారుల ద్వారా తెలుసుకున్న మేడిపల్లి పోలీస్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement