పెద్దపల్లిరూరల్: మత్స్యసహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలను నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, చెరువులు, కుంటల్లో నాణ్యమైన చేపపిల్లలను నిబంధనల ప్రకారమే అందించాలని మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రలో సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంఘం సభ్యులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ఫలాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారి నరేశ్ అన్నారు. సమావేశంలో సారయ్య, వీరస్వామి, శ్రీనివాస్, తిరుపతి, సుజాత, మొండయ్య, శ్రీకాంత్, కోటయ్య తదితరులు ఉన్నారు.


