జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. సోమవారం రాత్రి పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ 2025–26 నిర్వహించారు. ఈసందర్భంగా వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తితోపాటు క్రీడలను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్‌తోపాటు సదరన్ రీజియన్‌లోని కాయంకుళం, కుడ్డి, సింహాద్రి, వల్లూరు, రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులోని క్రీడాకారులు, క్రీడా విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


