మంథని: స్థానిక శ్రీరాంనగర్ సీతారామచంద్రుల ఆలయంలో సోమవారం వరిపిండిలో రాములోరి పాదాల గుర్తులు దర్శనమిచ్చాయి. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే పట్టాభిషేకం సందర్భంగా రాత్రి వేళ శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలోకి వస్తారని భక్తుల విశ్వాసం. ఈక్రమంలోనే ఈనెల 27న స్వామివారి కల్యాణం జరిపించగా, ఆదివారం రాత్రి పట్టాభిషేకం నిర్వహించారు. సోమవారం ఆ యలం తలుపులు తెరిచే సరికి స్వామివారి పాదాల గుర్తులు దర్శనమివ్వడంతో భక్తుల నమ్మ కం పదిలిమైంది. కాలనీవాసులతోపాటు సమీప ప్రాంతాల భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.


