పెద్దపల్లిరూరల్: సమాజంలో ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని బంజారా ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు ఎస్పీ నాయక్ అన్నారు. హన్మంతునిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణతో కలిసి పాల్గొన్నారు. హన్మంతునిపేట, చీకురాయి, భోజన్నపేట, మూలసాల, రాంపల్లి, మారెడుగొండ, గుర్రాంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించి వారి దీవెనలను పొందాలని ఆయన సూచించారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు
సైబర్‌నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వారి వలలో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. సైబర్‌మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబరుకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు మల్లేశ్, శ్వేతతో పాటు సర్పంచులు మ్యాడగోని శ్రీనివాస్, ఓదెల శ్రీనివాస్, త్రివేణి, తొగరి సంపత్, ఉపసర్పంచ్ మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.


