డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు వాసప్‌ | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు వాసప్‌

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

పెద్దపల్లి: జిల్లాకు చెందిన వరహగిరి శైలజ – వెంకటరావు దంపతులు తమకు కేటాయించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లును కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు సోమవా రం తిరిగి అప్పగించారు. తమ సంతానం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడిన నేపథ్యంలో తమకు ఈ ఇల్లు అవసరం లేదని భావించారు. దీనిని ఇతరపేద కు టుంబానికి కేటాయించాలని కలెక్టర్‌ను ఆయన కా ర్యాలయంలో సోమవారం కలిసి విన్నవించారు. క లెక్టర్‌ మాట్లాడుతూ, అవసరం లేకపోయినా ప్రభు త్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయతీకి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అభినందించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement