పైప్‌లైన్‌ లీకేజీలకు తక్షణ మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్‌ లీకేజీలకు తక్షణ మరమ్మతు

Mar 29 2026 6:56 AM | Updated on Mar 29 2026 6:56 AM

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో తాగునీటి సరఫరా అంతరాయానికి కారణమవుతున్న పైప్‌లైన్‌ లీకేజీలపై బల్దియా యంత్రాంగం కదిలింది. మేయర్‌ మహంకాళి స్వామి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక శారదానగర్‌ పీజీ కాలేజీ ఎదుట డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్లలో ఏర్పడిన లీకేజీలకు చేపట్టిన మరమత్తులను మేయర్‌ శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రశాంత్‌నగర్‌ నుంచి పవర్‌హౌస్‌కాలనీ వరకు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతుల్లో ఆలస్యం కాకుండా సాయంత్రంలోపే పూర్తిచేయాలని, ఆదివారం నుంచి తాగునీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని మేయర్‌ సూచించారు. లీకేజీల సమస్య వస్తే 93924 83959 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి నేపథ్యంలో తాగునీటి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ప్రతీ కనెక్షన్‌కు వాల్వ్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.

పర్యవేక్షించిన రామగుండం మేయర్‌ స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement