రుణాల పంపిణీలో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

రుణాల పంపిణీలో అగ్రస్థానం

Mar 29 2026 6:56 AM | Updated on Mar 29 2026 6:56 AM

● వసూళ్లలోనూ జిల్లా అగ్రగామి ● పురస్కారాలు అందుకున్న అధికారులు

కోల్‌సిటీ(రామగుండం): సీ్త్రనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా రాష్ట్రస్థాయిలో పురస్కారాలు సాధించింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీ్త్రనిధి 13వ సాధారణ సభలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ధనసరి సీతక్క, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి దివ్య దేవరాజన్‌ నుంచి అవార్డులు అందుకున్నారు. పట్టణ పరిధిలో రుణాల పంపిణీ, వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచినందుకు జిల్లా ప్రాజెక్టు సంచాలకురాలు, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీ్త్రనిధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎం.కాళిందిని సత్కరించారు. సీ్త్రనిధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్‌కు ప్రశంసలు దక్కగా, జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రాంతీయ నిర్వాహకుడు ఆర్‌.దుర్గాప్రసాద్‌కు అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మార్గదర్శకత్వంలో సీ్త్రనిధి విశేష ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement