రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శనివారం క్రయ, విక్రయదారులతో కిటకిటలాడాయి. మరో రెండురోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ప్రభుత్వం పనివేళలు పొడిగించిన విషయం విదితమే. ఉదయం 9.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. దీంతో చాలామంది స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యా ప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు 401 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని, మరోవంద వరకు ఉన్నాయని పేర్కొన్నారు.
సాయంత్రం 4 గంటల వరకు నమోదైన రిజిస్ట్రేషన్లు
కరీంనగర్ 27
గంగాధర 22
సిరిసిల్ల 58
పెద్దపల్లి 14
కరీంనగర్ రూరల్ 23
భీమదేవరపల్లి 21
మల్యాల 10
మంథని 7
సుల్తానాబాద్ 26
హుస్నాబాద్ 19
హుజూరాబాద్ 33
రామగుండం 21
మెట్‌పల్లి 21
వేములవాడ 38
జగిత్యాల 44
పెంచిన పనివేళలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం


