గోదావరిఖని: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. డీసీపీ రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీ మా ట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా సీటుబెల్ట్ ధరించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 శాతం సీటు బెల్ట్ ధరించకనే చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, పోలీస్ అధికారులు రమేశ్, అనూష, మనోహర్, హరీశ్‌శేఖర్, రామరాజు సిబ్బంది పాల్గొన్నారు.


