ఎండలు మండుతున్నాయి. తాగునీరు లభించడంలేదు. కనీసం నిలువ నీడకూడా లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పెద్దపల్లి జిల్లాగా అవతరించాక ప్రధాన కూడళ్లలో రిక్వెస్ట్ బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేసినా షెల్టర్‌లు నిర్మించలేదు. ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయ్యప్పగుడి చౌరస్తా, కూనారం చౌరస్తా, కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, రంగంపల్లి వరకు ఎక్కడా బస్‌షెల్టర్ లేదు. తాగునీటి వసతి గగనంగా మారింది. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


