● ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం, రజతం సాధించిన చికిత
కరీంనగర్‌స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్‌లో కజకిస్థాన్‌పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు.
కార్పొరేటర్‌పై కేసు
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ 18వ డివిజన్ కార్పొ రేటర్ చక్రపాణిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి యైటింక్లయిన్‌కాలనీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు గుడెల్లి రాంచందర్‌కు చక్రపాణికి మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. ఈవిషయంలో రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్‌రావు పేర్కొన్నారు.
చెరువులోపడి వృద్ధురాలి మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ఇనుగాల మధునమ్మ(80) చెరువులో పడి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మధునమ్మకు నలుగురు కుమారులు వివిధ కారణాలతో గతంలోనే మృతి చెందారు. మనుమల వద్ద ఆమె ఉంటోంది. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఈనెల 26 నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. శుక్రవారం స్థానిక నీలకంఠం చెరువులో మృతదేహం కనిపించింది. మృతిపై తమకు అనుమానం లేదని మృతురాలు మనుమడు రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.


