యూపీఐ లంచం! | - | Sakshi
Sakshi News home page

యూపీఐ లంచం!

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

యూపీఐ లంచం!

నగదు నుంచి డిజిటల్‌కు అవినీతి మార్గం రూటు మార్చిన పలువురు అధికారులు ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మామూళ్లు వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు యూటీఆర్‌ నంబర్లే లంచాల రశీదులంటున్న అధికారులు డిజిటల్‌ లంచాలపై ఏసీబీ స్పెషల్‌ ఫోకస్‌

కరీంనగర్‌ అర్బన్‌ ఎకై ్సజ్‌ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్‌ అండ్‌ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్‌ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement