ఆయుష్‌.. పనితీరు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయుష్‌.. పనితీరు భేష్‌

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఆయుష్‌లో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్‌ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. జిల్లా లోని పలు ఆస్పత్రుల నుంచి ఆయుర్వేదిక్‌ వైద్యం కోసం ముగ్గురు వైద్యులు, యునాని, హోమి యోపతి వైద్యం కోసం ఒక్కోవైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించారు. దీంతో పెద్దపల్లి ఆయుష్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు నిరంతరం అందుతాయనే నమ్మకం పేషెంట్లలో పెరిగింది. ఫలితంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో పెద్దపల్లికి వైద్యం కోసం వస్తున్నారు.

రోజూ 200 మందికి సేవలు

ఆయుష్‌ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ యునాని, ఆయుర్వేదిక్‌, హోమియోపతి సేవల కోసం ప్రతీనిత్యం సుమారు 200 మంది వరకు వస్తున్నారు. తమ వ్యాధి (బీపీ, షుగర్‌, కీళ్లనొప్పులు, గుండె, కిడ్నీ తదితర వ్యాధులు) నయం చేసుకునేందుకు వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్యపరీక్షలను ఇదే ఆవరణలోని టీహబ్‌ ద్వారా ఉచితంగానే చేయిస్తున్నారు. జబ్బు ఎలాంటిదైనా సరే.. వైద్యం అందిస్తుండడంతో పేషెంట్లకు నమ్మకం పెరుగుతోంది.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ ఆస్పత్రులకు దాదాపు ఏడాదిగా మందుల సరఫరా అరకొరగానే ఉంది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయుష్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌ మారుతి.. ఇటీవల కలెక్టర్‌ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ వెంటనే ఆస్పత్రిని సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన మందులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేసే ఉత్తరాఖండ్‌ నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో మందులు లేకున్నా.. పెద్దపల్లి ఆయుష్‌ కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు

డెప్యుటేషన్‌పై వైద్యుల నియమాకం

ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement