ఆటోడ్రైవర్లు ఉత్తమ పౌరులు | - | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్లు ఉత్తమ పౌరులు

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌ ఏరియా ఆ టోడ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, ఒంటరి మహిళలు, ప్రయాణికులను భద్రంగా గ మ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఉత్తమ పౌరు లుగా గుర్తింపు తెచ్చుకున్నారని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి ప్రశంసించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌తో కలిసి స్థానిక రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో బుధవారం అరైవ్‌.. అలైన్‌ నిర్వహించారు. డీసీ పీ మాట్లాడుతూ, ఆటోడ్రైవర్లపై ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం వారి ప్రవర్తనకు నిదర్శనమన్నారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సంధ్యారాణి, జీఆర్పీ ఇన్‌చార్జి తిరుపతి, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై లింగయ్య పాల్గొన్నారు.

ఏప్రిల్‌లో సమ్మర్‌ స్పెషల్‌ రైలు

రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌ – గోరఖ్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్‌ దక్కన్‌ నాంపల్లి–గోరఖ్‌పూర్‌ (07075) వైపు ఏప్రిల్‌ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్‌పూర్‌ – హైదనాబా ద్‌(07076) వైపు ఏప్రిల్‌ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్‌ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్‌, నిజామా బాద్‌, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్‌లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్‌ నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఆస్పత్రిలోకి వెళ్లేదెలా?

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందేందుకు వచ్చే పేషెంట్లు లోనికి వెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గేట్‌ ఎదుటనే అడ్డందిడ్డంగా ఆటోలు నిలిపి ఉంచుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. పోలీసులు, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హుండీ ఆదాయం రూ.6లక్షలు

కమాన్‌పూర్‌(మంథని): స్థానిక శ్రీఆదివరాహస్వామి హుండీ ఆదాయం రూ.6.01 లక్షలు సమకూరినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. ఆర్నెల్లలో భక్తులు కానుకలుగా హుండీలో వేసి న సొమ్మును బుధవారం లెక్కించామన్నారు. సర్పంచ్‌ రంగు సత్యనారాయణగౌడ్‌, ఉప సర్పంచ్‌ రఫీక్‌ సోహెల్‌, దేవాదాయ, ధర్మాదా య ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, అర్చకుడు రామానుజలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement