రామగిరి: సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొ ద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ సైంటి స్ట్ కనకజ్యోతి సూచించారు. పన్నూర్‌లోని మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌తో కలిసి బుధవారం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. కనకజ్యోతి మాట్లాడుతూ, సింగిల్ యూస్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం, వన్యప్రాణులు, నీటివనరులకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. వీటికి బదులు బట్ట సంచులు, మళ్లీ ఉపయోగించే సీసాలు, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాల వంటి సుస్థిర పద్ధతులు అవలంబిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి సుమన్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు
పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్ర మాదాలకు కారకులైన వారికి జైలుశిక్ష, జరిమానా వి ధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్‌చార్జి జడ్జి మంజుల బుధవారం తీ ర్పునిచ్చారని ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామన్నారు. వారిలో శాంతినగర్‌కు చెందిన నల్గొండ కోటేశ్వర్‌కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌కు చెందిన జగదీశ్‌కు మూడురోజుల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని వి వరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలు
పెద్దపల్లి: టీజీ సెట్ –2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో గురుకులాల్లో అర్హత గలవిద్యార్థులు ప్రవేశాలు పొందాలని బీసీ గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణిదీప్తి తెలిపారు.https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకుని, ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు ప్రవేశా లు పొందాలన్నారు.


