పశువులకు మేతగా టమాట | - | Sakshi
Sakshi News home page

పశువులకు మేతగా టమాట

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

పెద్దపల్లిరూరల్‌: మార్కెట్‌లో టమాట ధరలు పడిపోయాయి. రిటెయిల్‌గా కిలో రూ.5 దరతోనే విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌ ధరలు మరింత తగ్గిపోయాయి. వాటిని తోటలోంచి ఏరితే కూలీల ధర కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండడంతో బుధవారం టమాటలు పశువులకు మేతగా పోశారు.

28న డాక్టర్‌ పోస్టుల భర్తీ

పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల భర్తీ కోసం ఈనెల ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తెలిపారు. గైనకాలజీ, ఆప్తామాలజీ, రేడియాలజీ, ఆర్థో, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌(ఎంబీబీఎస్‌) పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి, అర్హతగలవారు బయోడేటాతోపాటు విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌కు రూ.52,351 వేతనం చెల్లిస్తారని, వివరాలకు 84990 61999, 94924 57809 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,368

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,368 ధర పలికిందని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,428గా, సగటు రూ.6,929గా ధర ఉందని వారు వివరించారు. రైతు తాము పండించిన పత్తిని నేరుగా మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement