ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా?

Mar 25 2026 6:56 AM | Updated on Mar 25 2026 6:56 AM

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయంలో బుధవారం బడ్జెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా తొలిజనరల్‌ బాడీ సమావేశం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈమేరకు మంగళవారం కౌన్సిల్‌హాల్‌ను సిబ్బంది శుభ్రం చేశారు.

బడ్జెట్‌ రూ.248కోట్లు..

నగర అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.248కోట్ల 66లక్షల 51వేలతో బడ్జెట్‌ రూపొందించారు. అయితే, ప్రజాసమస్యలపై కార్పొరేటర్లు చర్చిస్తారా? చప్పట్లు కొట్టి అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతారా? అనేది ఆశక్తిగా మారింది.

అజెండీలో 8 అంశాలు

పాలకర్గం ఏర్పడిన తర్వాత మేయర్‌ మహంకాళి స్వామి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం నాలుగు రోజుల క్రితమే కార్పొరేటర్లకు బడ్జెట్‌ అజెండాతోపాటు ఎనిమిది అంశాలతో కూడిన కాపీలను అందజేశారు.

కార్మికులకు అందని వేతనాలు

బల్దియాలోని సుమారు 125 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు ఈనెల 24వ తేదీ వరకు జీతాలు అందలేదు. మరో ఐదురోజుల్లో రెండోనెల వేతనాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీనెల 5వ తేదీన్నే చెల్లిస్తున్న అధికారులు ఈసారి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఈఈ ఎస్‌ఎల్‌ ద్వారా ఏడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పనిచేసిన అవుట్‌సోర్సింగ్‌ ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ విభాగంలోని ఆరుగురు ఎలక్ట్రీషియన్లకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.

నేడు రామగుండం బల్దియా బడ్జెట్‌ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement