కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలోని పెట్రో ల్ బంకుల్లో ‘నోస్టాక్’బోర్డులు దర్శనమిస్తున్నా యి. రెండు రోజులుగా పెట్రోల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. కొందరు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ప్రభావం రా నున్న రోజుల్లో ఇంకెంత ఉంటుందోనని వాహనదారులు వాపోతున్నారు. వరికోతల సీజన్ ప్రారంభం కావడంతో హార్వెస్టర్లు ఎలా పనిచేస్తాయనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. మరోవైపు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవ డం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.


