రోజూ ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

రోజూ ఇబ్బంది

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

రోజూ ప్రయాణం ఇబ్బందిగా ఉంది. వంద మందికిపైగా షిఫ్టుల వారీగా వెళ్లి వస్తున్నాం. కార్మికవాడలను కలుపుతూ బస్సు నడిపిస్తే మాకు సౌకర్యంగా ఉంటుంది. సింగరేణి చొరవ తీసుకుని కార్మిక కుటుంబాల ప్రయాణానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించాలి.

– బండ కుమార్‌, ఈపీ ఆపరేటర్‌

నేరుగా నడిపించాలి

ప్రతీరోజు కోల్‌కారిడార్‌ వెంట బస్సులు నడపాలి. మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేరుగా భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం వరకు బస్సులు నడిపించాలి. ఈవిషయంలో గోదావరిఖని డిపో అధికారులు చర్యలు తీసుకోవాలి.

– రాము, ఈపీ ఆపరేటర్‌, సెంటినరీకాలనీ

రూట్‌ సర్వే చేయిస్తాం

కోల్‌కారిడార్‌ వెంట బస్సు రూట్‌ సర్వే చేయిస్తాం. సింగరేణి ఉద్యోగులు నేరుగా డిపోకు వచ్చి కలిస్తే వారి సౌకర్యార్థం బస్సు రూట్‌ ప్రారంభిస్తాం. షిఫ్టులకు అనుకూలంగా బస్సుల సంఖ్య పెంచే విషయంలో అక్యుపెన్సీ ఆధారంగా ముందుకెళ్తాం.

– ఎం.నాగభూషణం, డిపోమేనేజర్‌, గోదావరిఖని

కాలనీ నుంచి భూపాలపల్లికి

యైటింక్లయిన్‌కాలనీలో ఉంటూ భూపాలపల్లిలో డ్యూటీ చేస్తున్న. రోజూ వెళ్లిరావడం కష్టంగా ఉంది. కాలనీ నుంచి జీడీకే–11 గని వరకు బైక్‌పై వెళ్లి అక్కడి నుంచి బస్సులో మంథని, భూపాలపల్లికి వెళ్లాల్సి వస్తోంది. కాలనీ మీ దుగా బస్సు నడిపిస్తే సౌకర్యంగా ఉంటుంది.

– రాములు, ఈపీ ఆపరేటర్‌, భూపాలపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement