సమష్టి కృషితోనే రికార్డు | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే రికార్డు

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

గోదావరిఖని: సమష్టి కృషితో ఓసీపీ–3 కార్మికులు రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించారని సింగరేణి ఆర్జీ–2 జీఎం వెంకటయ్య అభినందించారు. ఆదివారం ఓసీపీ–3 కృషి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఓబీ 1.95లక్షల క్యూబిక్‌ మీటర్లకు 2.35 క్యూబిక్‌ మీటర్లు వెలికితీశారన్నారు. రోజులో 39,807 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారన్నారు. నిర్దేశిత లక్ష్య సాధనలో కృషి చేసిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. మెరుగైన ప్రణాళికతో సరైన సమయంలో భారీ యంత్రాలను సద్వినియోగం చేసుకోవడంతో ఈస్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఆర్థిక సంవత్సరం చివరి వరకు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు. రక్షణతో ఉత్పత్తికి ప్రతీఒక్కరు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉదయ్‌హరిజన్‌, మేనేజర్‌ భారత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.

సింగరేణి ఆర్జీ–2జీఎం వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement