మిల్లర్లకు సహకరించిన అధికారులపై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లకు సహకరించిన అధికారులపై చర్యలేవి?

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని రైస్‌మిల్లర్లకు అధికారులు లోపాయికారీగా సహకరించడంతోనే అక్రమాలకు పాల్పడి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిజాయతీగా సీఎంఆర్‌ అప్పగించిన మిల్లర్లకు అలాట్‌మెంట్‌ ఇవ్వకుండా డీఫాల్టర్లకే మళ్లీ కేటాయింపులు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే రూ.కోట్లు దోచుకున్నారని, అందులో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీబీఐతో విచారణ జరిపించి దోషులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు దిలీప్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement