సీఎంను కలిసిన ప్రభుత్వ విప్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ప్రభుత్వ విప్‌

Mar 21 2026 4:56 AM | Updated on Mar 21 2026 4:56 AM

పెద్దపల్లి: ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్యే విజయరమణారావు శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ను కలిశారు. వారిని శాలువాలతో సన్మానించారు.

‘రైతుభరోసా’కు వేళాయె

పెద్దపల్లి: రైతుభరోసాపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. కొత్తవారి నుంచి సైతం దర ఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 22న సిద్దిపే టలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి.. రైతుభరోసా నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటారని జిల్లా వ్య వ సాయాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో 1,51,300 మంది రైతుల రూ.162 కోట్ల 52 ల క్షలు జమచేయనున్నట్లు ఆయన వివరించారు.

23న ‘చలో హైదరాబాద్‌’

పెద్దపల్లి: నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 23న హైదరాబాద్‌ సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌ కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ధర్నా ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌, ఉపాధ్యక్షుడు జిలుక శంకర్‌, నాయకులు ఐ.రాజేశం, ఎం.దుర్గయ్య, కె.ఎల్లయ్య, డి.బుచ్చమ్మ, పెరిక వెంకటస్వామి, డి.రాజేశం, ఎం.కొమరయ్య, ఎం.కాంతయ్య, ఆర్‌.రాయమల్లు, ఆర్‌.సదానందం, గుండు రాజయ్య, రమేశ్‌, కె.మల్లేశం, శోభన్‌ పాల్గొన్నారు.

ఏర్పాట్లు పరిశీలన

పెద్దపల్లిరూరల్‌: పట్టణ శివారులోని చందపల్లి ఈద్గావద్ద ముస్లింల రంజాన్‌ ప్రార్థనల కోసం చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌ శుక్రవారం పరిశీలించారు. శనివారం జరిగే సామూహిక ప్రార్థనల కోసం వచ్చే ముస్లింలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, తాగునీటి వసతి కల్పించినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య తెలిపారు. కౌన్సిలర్లు ఫణీంద్రభూపతి, కొలిపాక సంపత్‌, అశ్రఫ్‌, అస్లాం, ఏఈ సతీశ్‌తోపాటు రమాకాంత్‌, రాజు తదితరులు ఉన్నారు.

తగ్గుతున్న పిచ్చుకల సంఖ్య

గోదావరిఖని: మొబైల్‌ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడంతో పిచ్చుకలు అంతరించి పోతున్నాయని సింగరేణి ఆర్జీ–వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తన కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకమన్నారు. వాటి సంరక్షణకు ప్రతీఒక్కరు బాధ్యతగా ముందుకు రావా లని కోరారు. కార్యక్రమంలో గ్రీన్‌ వారియర్‌ జేవీఎస్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఆర్థికాభివృద్ధికి చేయూత

జ్యోతినగర్‌: మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్టీపీసీ చేయూత అందిస్తోందని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్‌ సమీపంలోని వృత్తి శిక్షణ కేంద్రంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందించి మాట్లాడారు. మహిళలు ఖాళీగా ఉండకుండా కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఆదాయ మార్గాలను సమకూర్చుకోవాలన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాస ప్రాంతాల్లోని యువతీయువకులకు వృత్తి శిక్షణ అందిస్తుందని తెలిపారు. అనంతరం జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సేవా సమితి సభ్యులు, సీఎస్సార్‌ ప్రతినిధులు, కుట్టు శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement