విప్‌ పదవి ప్రజలకే అంకితం | - | Sakshi
Sakshi News home page

విప్‌ పదవి ప్రజలకే అంకితం

Mar 21 2026 4:56 AM | Updated on Mar 21 2026 4:56 AM

ఏప్రిల్‌ మొదటివారంలో పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణం షురూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా నిలుస్తాం ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్‌: ప్రభుత్వం తనకు అప్పగించిన విప్‌ పదవి ప్రజలు, కార్యకర్తలకే అంకితం ఇస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. వి ప్‌గా నియాకమైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ నుంచి ఆయన శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి నుంచి జిల్లా కేంద్రంలోని జెండా కూడలి వరకూ కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దారిపొడవు నా ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయనకు బ్రహ్మర థం పట్టారు. గర్రెపల్లి, సుల్తానాబాద్‌తోపాటు పె ద్దపల్లి జెండాకూడలిలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. రూ.156 కోట్ల వ్యయంతో పెద్దపల్లి బైపాస్‌ పనులకు ఏప్రిల్‌ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామన్నారు. పెద్దపల్లిలోని పలు వార్డుల అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరయ్యాయని, రూ.1,350కోట్లతో నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో మిగిలిన పనులను పూర్తిచేస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీమంత్రి శ్రీధర్‌బాబు, మంత్రుల సహకారంతో తనకు విప్‌ లభించిందని పేర్కొన్నారు. కాగా, సుల్తానాబాద్‌లో కౌన్సిలర్‌ అమిరిశెట్టి శ్రావణి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అమిరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. మాజీ ఎంపీటీసీ పల్లా సురేశ్‌ గజమాలతో సత్కరించారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్లు బిరుదు రాధా కృష్ణ, నూగిల్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావుతోపాటు మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మొండయ్య, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సతీశ్‌, ఆకుల నర్సయ్య, శ్రీగిరి శ్రీనివాస్‌, అంతటి పుష్పలత, కళ్లపల్లి జానీ, పడాల అజయ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement