గడువులోగా పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తిచేయాలి

Mar 21 2026 4:56 AM | Updated on Mar 21 2026 4:56 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథని: డివిజన్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన సంగీత నృత్యపాఠశాల, మున్సిపల్‌ కార్యాలయం, జూనియర్‌ బాయ్స్‌ స్కూల్‌, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోని పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం షెడ్యూల్డ్‌ కులాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురుకులంలోని స్టేజీ, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ వంటి పనులు పూర్తిచేశామని, పాత స్కూలు భవనం, హాస్టల్‌కు అవసరమైన మరమ్మతులు చేయించి పెయింటింగ్‌ వేయాలని సూచించారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ రెనోవేషన్‌ భాగంగా పెయింటింగ్‌, అంతర్గత సీసీ రోడ్డు పనులు త్వ రగా పూర్తిచేయాలని తెలిపారు. 50 పడకల ఆస్పత్రి పనులు స్లాబ్‌దశలో ఉన్నాయని, వీటిని గడువులోగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ వి క్రమ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ శంకరయ్య, ఏఈలు అనుదీప్‌, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

రామగిరి(మంథని): రామగిరి తహసీల్దార్‌ కార్యాల య భవనం కోసం కేటాయించిన స్థలం, పన్నూర్‌ లోని కేజీబీవీని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించా రు. కేజీబీవీలోని మాడ్యులర్‌ కిచెన్‌ ప్రారంభించా రు. కాంపౌండ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ సుమన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement