గ్రామీణ క్రీడలతో ప్రతిభ వికాసం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ క్రీడలతో ప్రతిభ వికాసం

Mar 19 2026 10:23 AM | Updated on Mar 19 2026 10:23 AM

● రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత

జ్యోతినగర్‌: గ్రామీణ క్రీడలతో క్రీడాకారుల్లోని ప్రతిభ వికసిస్తుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. బుధవారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌ జెడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో మూడురోజులుగా ఎన్టీపీసీ నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా పోటీలు(ఖోఖో, వాలీబాల్‌) బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు ఈడీ బహుమతులు అందించి మాట్లాడారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు అవసరమన్నారు. సీఎస్సార్‌ కార్యక్రమాల ద్వారా ఎన్టీపీసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, క్రీడలు వంటి రంగాల్లోనూ విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బిజయ్‌ కుమార్‌ సిగ్దర్‌, ప్రవీణ్‌ కే చౌదరి, ఫిజికల్‌ డైరెక్టర్లు, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, కమాన్‌పూర్‌ మండలాల్లోని 21 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement