లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

Mar 19 2026 10:23 AM | Updated on Mar 19 2026 10:23 AM

గోదావరిఖని: నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాల ని ఐఎఫ్‌టీయూ నాయకులు కోరారు. బుధవారం జీఎం కార్యాలయంలో పర్సనల్‌అధికారి వేణుగోపాల్‌కు ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ వి నతిపత్రం అందజేశారు. రామకృష్ణ, చింతల శేఖర్‌, ఎం.కాంతయ్య రాజయ్య, శేఖర్‌ పాల్గొన్నారు.

నాయబ్‌ తహసీల్దార్లకు పదోన్నతి

కరీంనగర్‌ అర్బన్‌: ఉమ్మడి జిల్లాలో పలువురు నా యబ్‌ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పి స్తూ సీసీఎల్‌ఎ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెంన 14మంది నాయబ్‌ తహసీల్దార్లకు పదోన్నతి లభించగా ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన ఐదుగురిని ఉమ్మడి జిల్లాకు అలాట్‌ చేశారు.

బదిలీ అయిన వారి వివరాలు

అబ్దుల్‌ ఖాదీర్‌ జగిత్యాల నుంచి నిర్మల్‌కు, బీఎస్‌ఎ స్‌ వరప్రసాద్‌ జగిత్యాల నుంచి ఆదిలాబాద్‌కు, స య్యద్‌ నిజాముద్దీన్‌ కరీంనగర్‌ నుంచి కొమురంబీం ఆసిఫాబాద్‌కు, మన్లోజ్‌ కిరణ్‌కుమార్‌ జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు, దోమ మారుతిరెడ్డి రాజన్న సిరిసిల్లలోనే పోస్టింగ్‌ తీసుకున్నారు. కట్ట విష్ణు జగి త్యాల నుంచి నిజామాబాద్‌కు, ముక్తర్‌ పాషా రాజ న్న సిరిసిల్ల నుంచి జగిత్యాలకు, తూకుంట్ల వసంతరావు కరీంనగర్‌ నుంచి జయశంకర్‌భూపాలపల్లికి, తడ స్వరూపరాణి కరీంనగర్‌ నుంచి జయశంకర్‌ భూపాలపల్లికి బదిలీ అయ్యారు. బైరం అచ్యూతరెడ్డి జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు, అజ్మత్‌ నవాజ్‌ క రీంనగర్‌ నుంచి నిజామాబాద్‌కు, బొమ్మకంటి శ్రీని వాస్‌ జగిత్యాల నుంచి ఆదిలాబాద్‌కు, వైశాలి కరీంనగర్‌ నుంచి రాజన్న సిరిసిల్లకు, దివ్యజ్యోతి రాజన్న సిరిసిల్ల నుంచి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు

కొలుగూరి రవీందర్‌రావు వరంగల్‌ నుంచి పెద్దపల్లికి బదిలీ అయ్యారు. బి.రాజశేఖర్‌, ఎం.దత్తాద్రి, ఎండి.మునీరుద్దీన్‌ నిజామాబాద్‌ నుంచి, బానపు రం జ్యోతి కామారెడ్డి నుంచి జగిత్యాలకు వచ్చారు.

అధికారికి కంపల్సరీ రిటైర్మెంట్‌

గోదావరిఖని: సింగరేణి అధికారికి కంపల్సరీ రిటైర్మెంట్‌ ఇస్తూ యాజమాన్యం బుధవారం ఆదేశా లు జారీ చేసింది. రామగుండం రీజియన్‌లోని ఈ అండ్‌ఎంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ను కంపల్సరీ రిటైర్మెంట్‌ చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఇల్లెందులో పనిచేస్తున్న సమయంలో ఓ చోరీ విషయంలో బాధ్యుడిగా చేస్తూ విజిలె న్స్‌ విచారణ కొనసాగింది. సదరు అధికారి హస్తం ఉందని తేలడంతో యాజమాన్యం కంపల్సరీ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement