అభివృద్ధి పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

Mar 19 2026 10:23 AM | Updated on Mar 19 2026 10:23 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌(బాలురు)లోని పదో తరగతి పరీక్ష కేంద్రం, ప్రభుత్వ ఐటీఐలో చేపట్టిన స్విమ్మింగ్‌పూల్‌, వ్యవసాయ మార్కెట్‌లో చేపట్టిన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్ట్‌ కాంప్లెక్స్‌ పనులను బుధవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో మూడురోజులుగా జరుగుతున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2027లో చేపట్టే జనగణన తొలిదశలో నివాసాలు, భవనాలను పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. వంటగ్యాస్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి 29 సిలిండర్లు సీజ్‌ చేశామని తెలిపారు. సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 08728– 224045కు ఫోన్‌చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement