కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో స్వశక్తి మహిళలకు బూర్గుల అనిత ఆదర్శంగా నిలిచారని మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ప్రశంసించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమృత్‌మిత్ర మహోత్సవ్‌లో నగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన బూర్గుల అనితను బుధవారం మేయర్, కమిషనర్ తమ చాంబర్లలో ప్రత్యేకంగా అభినందించారు. 59వలోని మార్గదర్శి స్లమ్ సమాఖ్యలో భాగమైన శ్రీసరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత అమృత్ మిత్రగా ఎంపికై కొంతకాలంగా దుర్గానగర్ అమృత్ పార్క్‌లో పనిచేస్తున్నారు. ఈనెల 13న న్యూఢిల్లీలో నిర్వహించిన అమృత్‌మిత్ర మహోత్సవ్‌లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఐదుగురిని నామినేట్ చేయగా, అందులో రామగుండం నుంచి అనితకు అవకాశం లభించింది. న్యూఢిల్లీ వెళ్లి వచ్చిన అనిత.. మర్యాద పూర్వకంగా మేయర్, కమిషనర్‌ను కలిశారు.


