కాల్వశ్రీరాంపూర్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున సుమారు గంటపాటు భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో గోదావరిఖని, పెద్దపల్లి, మంథ ని తదితర ప్రాంతాల్లో లోతట్టు జలమయం అ య్యాయి. వివిధ గ్రామాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేట, కూనారం, మడిపెల్లి, పెగడపల్లి, గంగారం, పందిల్ల తదితర గ్రామాల్లో మొక్కజొన్నకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. వెన్నంపల్లి గ్రామంలో 65 మంది రైతులకు చెందిన 95 ఎకరాలు, మంగపేటలో 25 మందికి చెందిన 35 ఎకరాలు, కూనారంలో 72 మందికి చెందిన 110 ఎకరాలు, మడిపెల్లిలో 68 మందికి చెందిన 105 ఎకరాలు, పెగడపల్లిలో 82 మందికి చెందిన 132 ఎకరాలు, గంగారంలో 66 మందికి చెందిన 82 ఎకరాలు, పందిల్లలో ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాలధికారుల ప్రాథమిక అంచనా. మరికొన్ని గ్రామాల్లోనూ పంట పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
జూలపల్లిలో వర్షం
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో వేకువజామున వర్షం కురిసింది. వరి కంకి వేసే దశలో ఉండగా, మొక్కజొన్న కంకులు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం కురవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఓదెలలో..
ఓదెల: ఓదెల, కొలనూర్, పొత్కపల్లి, గుంపులలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి.
జిల్లాకు వర్ష సూచన
పెద్దపల్లి: రానున్న 24గంట్లో జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అకాల వర్షంతో అన్నదాత ఆగం
560 ఎకరాల్లో మొక్కజొన్న నేలపాలు


