పండుగపూట పస్తులేనా? | - | Sakshi
Sakshi News home page

పండుగపూట పస్తులేనా?

Mar 18 2026 7:40 AM | Updated on Mar 18 2026 7:40 AM

● ఆశ వర్కర్లు నిత్యం విధుల్లోనే ఉంటున్నారు. గర్భిణులను గుర్తించడం, సంపూర్ణ వివరాలు నమోదు చేయించడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలు సాగేలా చూడడం వీరి ప్రధాన బాధ్యతలు. ● గ్రామాల్లోని చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా చూడడం, గర్భనిరోధక సాధనాల వినియోగం, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడం, జ్వరం, దగ్గు తదితర అంటువ్యాధుల లక్షణాలు ఉంటే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం ● చిన్న గాయాలు, విరేచనాలు వంటి అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించడం, ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం.

పెద్దపల్లి/రామగుండం: రెండు నెలలుగా వేతనాలు అందడం లేదనే మనోవేదనతో జిల్లాలోని ఆశ కార్యకర్తలు సోమవారం నుంచి సమ్మె చేస్తున్నారు. వచ్చే ఉగాది, రంజాన్‌ పండుగలు జరుపుకునేందుకు చేతిలో డబ్బుల్లేవని ఆవేదన చెందారు. వేతనాలు, హక్కుల సాధన తదితర అంశాలపై ఈనెల 5 నుంచే ఆశ వర్కర్లు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 489 మంది సమ్మెలోకి వెళ్లడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది.

ఇవీ సేవలు..

ఇవీ డిమాండ్లు

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, విధుల్లో మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, బీమా సౌకర్యం కల్పిస్తూ రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ఆశ వర్కర్లకు ఇళ్లు మంజూరు చేయాలని, ఆశ వర్కర్లలో ఉన్నత విద్యార్హతలు గలవారిని గుర్తించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు.

ఆశ కార్యకర్తల ఆవేదన

విధులు బహిష్కరించి నిరసన

రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement