పెద్దపల్లిరూరల్: బాలలు బడికి వెళ్లేలా చూడాలని, బాలికలకు పెళ్లిళ్లు జరగకుండా చూడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన అన్నారు. బ్రాహ్మణపల్లిలో మంగళవారం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రోజారాణి అధ్యక్షతన బాలల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. చందన మాట్లాడుతూ, బడీడు పిల్లలంతా క్రమశిక్షణతో చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు.
బాల్య వివాహ రహిత గ్రామం బ్రాహ్మణపల్లి
పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఏడాదిగా బాల్య వివాహాలు జరగడంలేదు. ప్రతీ విద్యార్థి రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్లడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. బ్రాహ్మణపల్లి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా ప్రకటించారు. బాల్యవివాహాలను నిర్మూలించడం కోసం ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, సీడీపీవో కవిత తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన
చైల్డ్ మ్యారేజీ ఫ్రీ విలేజ్‌గా బ్రాహ్మణపల్లి ఎంపిక


