రజకులపై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

రజకులపై దాడి హేయం

Mar 18 2026 7:40 AM | Updated on Mar 18 2026 7:40 AM

ఎలిగేడు: బుర్హాన్‌మియాపేటలో రజకులపై దాడి హేయమని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యా ల మహేశ్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్‌ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదనే అక్కసుతో గాదల వెంకట్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు కలిసి రజక కులానికి చెందిన పరుశరాములుపై దాడి చేశారని, దీనిని తాము రజక జాతిపై జరిగిన దాడిగా పరిగణిస్తామన్నారు. దాడిపై విచారణ చేసిన పోలీసులు తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందు లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కోరారు. రజక సంఘం జిల్లా కార్యదర్శి గంగిపల్లి వెంకటేశ్వర్లు, గోపు లక్ష్మారెడ్డి, గుజ్జుల మల్లారెడ్డి, రవీందర్‌రావు, మధుకర్‌, నిరంజన్‌, ముంజంపల్లి సాయిలు, ముంజంపల్లి ఆగయ్య, చంద్రయ్య, రాకేశ్‌, రాజేశ్‌, మల్లేశ్‌, అనిల్‌, ఓదెలు, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement