రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. జిల్లాలో ఇద్దరు ఆశ వర్కర్లు చనిపోయారు. వారికి వెంటనే బీమా సొమ్ము అందించాలి. వివిధ పథకాల సర్వేలకు సంబంధించిన ప్రత్యేక నిధులను తక్షణమే విడుదల చేయాలి.
– మమత, ఆశ వర్కర్ల సంఘం నేత,
నారాయణపూర్
అధికారుల దృష్టికి తీసుకెళ్తా
ఆశ వర్కర్ల సమ్మె సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాం. ప్రజలకు అసౌ కర్యం కలుగకుండా ఏఎన్‌ఎంల ద్వారా సేవలు అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశాం. వివిధ పథకాల సర్వేలు సైతం నిరంతరం కొనసాగుతున్నాయి.
– దయామని, జిల్లా ఇన్‌చార్జి,
ఆశ వర్కర్ల సంఘం, పెద్దపల్లి


