మెట్‌పల్లిరూరల్: మండలంలోని వేంపేటలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. గ్రామంలోని మూడు ఆలయాలు, ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గంగమ్మ, రామాలయం, శివాలయంలో బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. కల్లెడ లత ఇంట్లో చోరీ చేశారు. ఎర్ధండిలోని తన తల్లిగారింటికి వెళ్లిన లత.. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 8 గ్రాముల బంగారం, 9 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
హనుమాన్ ఆలయంలో చోరీ
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట హనుమాన్ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలోని హుండీని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. ఈమేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. హుండీలో సుమారు రూ.15వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. హుండీని ప్రతీ శ్రీరామనవమికి తెరిచి లెక్కిస్తారు.
గుర్తుతెలియని మహిళ మృతి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: సిరిసిల్ల పట్ట ణంలోని కార్గిల్‌లేక్‌లో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరా లు. మృతురాలి వయస్సు సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఎత్తు సుమారు 4 అడుగులు 4 అంగుళాలు, గుండ్రటి ముఖం, చామనచాయ. లేత ఆకుపచ్చ రంగు చీర, ముదురు ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉందని వివరించారు. మెడలో తెలు పు, గులాబీ రంగు దారం, నలుపు–బంగారు రంగు పూసల దండలు ఉన్నాయని పేర్కొన్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసి న వారు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో, సీఐ ఎన్.శ్రీనివాస్ 87126 56366, ఎస్సై మురళీధర్‌గౌడ్ 99898 07854లో సంప్రదించాలని కోరారు.
బస్సు ఢీకొని..
మల్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం..మల్యాల మండలం ముత్యంపేట శివారులోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు బస్ స్టేజీ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విశారదన్ మహారాజ్ అరెస్టుపై నిరసన
జగిత్యాలటౌన్: విశారదన్ మహారాజ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. జాక్ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, గొల్లపల్లి శ్రీకాంత్‌గౌడ్, దువ్వాక శివమహారాజ్ పాల్గొన్నారు.


