పెద్దపల్లి: నాలుగు లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ప్రకాష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌ను 2019–20 మధ్యకాలంలో పార్లమెంట్ చేత ఆమోదింపజేసుకొని 2025 నవంబర్ 1న నోటీఫై చేసిందని, నోటీఫై చేసిన కోడ్స్‌ను 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించిందన్నారు. కార్మికవర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్‌ను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఇ.నరేశ్, ప్రధాన కార్యదర్శి బి.అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ఐ.రాజేశం, ఎం.దుర్గయ్య, ఎం.కొమరయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, డి.బుచ్చమ్మ, రాజేశం, ఎం.కాంతయ్య, కె.ఎల్లయ్య, పెరిక వెంకటస్వామి, ఆర్. రాయమల్లు, శోభన్‌బాబు, కె.మల్లేశ్, ప్రేమ్‌కుమార్ దితరులు పాల్గొన్నారు.


