గ్యాస్ లేకపోవడంతో టిఫిన్ సెంటర్ మూసేసిన. నాతో పాటు 8 మందికి ఉపాధి కల్పిస్తున్న. జీవనోపాధి దెబ్బ తీయకుండా చూడాలి. మావి పేద, మధ్య తరగతి బతుకులు. హోటళ్ల నిర్వాహకులు, పని చేసేవారు ఎక్కువ సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అధికారులు చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలి.
– కుమారస్వామి, టిఫిన్ సెంటర్ యజమాని
జిల్లాలో గ్యాస్ కొరత లేదు. డొమెస్టిక్‌కు సంబంధించి అసలు ఇబ్బందులు లేవు. గ్యాస్ కొరత ఉందని అందరూ ఒకేసారి బుక్ చేయడంతో ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీలకు నిత్యం గ్యాస్ వస్తుంది. వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనాథ్, డీఎస్‌వో


