జిల్లాలో..
హోటళ్లకు గ్యాస్ కొరత
మూతపడుతున్న టీస్టాళ్లు, టిఫిన్ సెంటర్లు
డొమెస్టిక్ వినియోగదారులకూ తప్పని తిప్పలు
కట్టెలకు పెరిగిన గిరాకీ
పెద్దపల్లి: పశ్చిమాసియాలోని యుద్ధం మంటలు జిల్లాకు తాకాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది. గృహ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. పట్ట ణాలతో పాటు మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీల్లో ఈ సమస్య నెలకొంది. కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యి వినియోగిస్తుండగా, పెరిగిన ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. గ్యాస్ కొర త లేదని అధికారులు చెబుతున్నా, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు.
టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం
● జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 15 ఉండగా, సింగరేణి ఆధ్వర్యంలో 4 కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా డొమెస్టిక్, కమర్షియల్ కలిపి మొత్తం 251,012? ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
● గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి. కట్టెల పొయ్యిల వాడకం పెరిగింది.
● దీంతో వంటలు తయారయ్యేందుకు పెరిగిన ఖర్చులను నిర్వాహకులు వినియోగదారులపై వడ్డిస్తున్నారు.
● యుద్ధం కారణంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత 20 రోజులకు సిలిండర్ డెలివరీ అవుతుందని మొదటిసారి ప్రకటించిన అధికారులు, రెండో విడత 45 రోజులు అని ప్రకటించడంతో డొమెస్టిక్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● జిల్లాలో టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, వివిధ రకాల హోటళ్లు, రెస్టారెంట్లు దాదాపు 3,800, టీ స్టాళ్లు 5వేల వరకు ఉంటాయని అధికారుల అంచనా.
● వీటిపై ఆధారపడి దాదాపు 42,287 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
● హోటళ్లు మూతపడుతుండడంతో వంట మనుషులు, వర్కర్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.
కట్టెల ధరలకు రెక్కలు
వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడంతో కొన్ని హోటళ్ల నిర్వాహకులు కట్టెలపై పొయ్యిపై వంటలు చేస్తున్నారు. సమయానికి కట్టెలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కట్టెలు క్వింటాల్‌కు రూ.5,00 నుంచి రూ.700 ధర పలుకుతున్నట్లు హోటళ్ల యజమానులు చెబుతున్నారు.
డొమెస్టిక్ సిలిండర్లు 2,24,000
కమర్షియల్ 27,012
మొత్తం 251,012?


