ప్రణాళికలు
గోదావరిఖని(రామగుండం): సంప్రదాయ విద్యుత్‌పై సింగరేణి దృష్టి సారించింది. సొంతంగా వనరులను రూపొందించుకుని దేశానికి విద్యుత్ సరఫ రా చేయాలని చూస్తోంది. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో దేశ అవసరాల దృష్ట్యా జీరో నెట్ ధ్యేయంగా సింగరేణి ప్రణాళికలు సి ద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో దేశానికి దన్నుగా నిలవాలనే యోచనతో సింగరేణి సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే సంస్థవ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి భారీగా పెంచింది. 245.5 మెగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2030 నాటికి జీరోనెట్ సంస్థగా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో 2వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూస్తోంది. అలాగే మేడిపల్లి ఓసీపీలో జలవిద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు పూర్తి చేసింది. 500 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేసి సంప్రదాయ విద్యుత్ లక్ష్యంగా నిర్ణయించింది. అలాగే రాబోయే రోజుల్లో పవన విద్యుత్ కూడా ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో సాగుతోంది. ఎత్తులో ఉన్న ఓసీపీ ఓబీ కుప్పలు, ఎత్తైన కొండలపై పవన విద్యుత్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో సంస్థకు అదనపు ఆదాయంతో పాటు ఎలాంటి కాలుష్యం ఉండబోదని అంటోంది. ఇలా జీరోనెట్ ధ్యేయంగా సోలార్, జల, పవన విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ముందుకెళ్తూ రాబోయే తరాలకు సంప్రదాయ విద్యుత్ అందించాలని చూస్తోంది.


