రామగుండం అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రామగుండం అభివృద్ధే ధ్యేయం

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

● మేయర్‌ మహంకాళి స్వామి

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. 33వ డివిజన్‌లో బూడిద స్వప్నకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పత్రాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్‌ మేరుగు భూలక్ష్మీతో కలిసి అందజేసి, ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మార్గదర్శకత్వంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు. కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా వసతుల కల్పన

గోదావరిఖనిటౌన్‌: కార్పొరేట్‌కు దీటుగా రామగుండం కార్పొరేషన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సహకారంతో వసతులు కల్పిస్తామని మేయర్‌ స్వామి అన్నారు. 36వ డివిజన్‌ గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బెస్ట్‌ రన్నర్స్‌ ఆర్గనైజేషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.1.70 లక్షల విలువ చేసే ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమరాలను అందజేశారు. కార్పొరేటర్‌ కల్వల పద్మావతి, ఎంఈవో మల్లేశం, సంస్థ ప్రతినిధులు కోలేటి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement