రంజాన్‌ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

● సీపీ అంబర్‌కిశోర్‌ ఝా

పెద్దపల్లి: రంజాన్‌ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ ఝా అన్నారు. సోమవారం జిగ్నెకి రాత్‌ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు మసీద్‌లను సందర్శించారు. ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుకునేలా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మసీదు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి, రాత్రి సమయంలో ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని సీపీ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement