పోలీసుల డేగకన్ను
సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలపై డేగకన్ను వేశాం. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచాం. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతాం. నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిపై కఠిన చర్యలుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి.
– అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం


