కార్మికులపై కేంద్ర ప్రభుత్వం దాడి
గోదావరిఖని: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడికి దిగుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ జెండా ఎగురవేశారు. ఆయన మా ట్లాడుతూ ఈనెల 31న యూనియన్ 18వ మహాసభలు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక చ ట్టాల ను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చిందని ఆయన ఆరోపించారు. దీనిని అమలు చేయడానికి రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి పెంచిందని ఆరోపించారు. లేబర్‌కోడ్‌లు అమలైతే.. భారత కార్మికవర్గం బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్‌కోడ్‌ల రద్దు కోసం కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య, శివరాంరెడ్డి, రమేశ్, మధు, మల్లేశ్, సమ్మయ్య, సారయ్య, ఆంజనేయులు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.


