స్వేచ్ఛగా ఓటు వేయాలి
పెద్దపల్లి: స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్ర జలు సహకరించాలని, ఓటుహక్కును స్వేచ్ఛగా వి నియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కో రారు. మూడోవిడతలో పోలింగ్ నిర్వహించే పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన సోమ వారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లోని పోలీస్‌లు ఎన్నికల అధికారులకు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలాన్నారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రా లకు రావడం నిషేధమన్నారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూ చించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


