యంత్రాంగం.. సిద్ధం
సాక్షి పెద్దపల్లి/మంథని: జిల్లాలో తొలివిడత జరిగే పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. ఈమేరకు అధికారులు స ర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో బుధవారమే ఆయా కేంద్రాలకు తరలివెళ్లారు.
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఆలోపు పోలింగ్ కేంద్రంలోని వారందరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం క ల్పిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభి ఫలితలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక చేపడతారు. అనివార్య కారణాలతో ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు నిర్వహిస్తారు.
95 సర్పంచ్ స్థానాల్లో 377మంది పోటీ..
తొలివిడతలోని 99 పంచాయతీల్లో 4 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 95 సర్పంచ్ స్థానాలకు 377 మంది పోటీపడుతున్నారు. 896 వార్డు స్థానాల్లో 211 ఏకగ్రీవం కాగా, మిగిలిన 685 వార్డు స్థానాల కోసం 1,880 మంది పోటీ పడుతున్నారు. ఈమేరకు ఎన్నికల సిబ్బంది సామగ్రితో బుధవారమే ఆయా కేంద్రాలకు తరలివెళ్లారు.
5 మండలాలు.. 1.45 లక్షల మంది ఓటర్లు..
తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 1,45,710 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 39 రూట్లు, 18 జోన్లుగా విభజించారు. 685 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. డిస్ట్రిభ్యూషన్ కేంద్రాల్లో సామగ్రిని సరిచూసుకున్న ఎన్నికల సిబ్బంది.. పోలీసు బందోబస్తు మ ధ్య తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వా హనాల్లో తరలివెళ్లారు.
అధికారుల పర్యవేక్షణ..
మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్జీవో సురేశ్, గోదావరిఖ ని ఏసీపీ రమేశ్, ఎంపీడీవో శ్రీనిజరెడ్డితోపాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు ఎన్నికల సా మగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.
27 సమస్మాత్మక ప్రాంతాలు..
జిల్లాలో 27 సమస్యాత్మక గ్రామాలు, వార్డుల్లోని 305 సున్నితమైన కేంద్రాలుగా పోలీసులు గుర్తించా రు. పోలింగ్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అ మలులో ఉన్నాయని, సభలు, ర్యాలీలకు అనుమతిలేదని లేదని, ప్రజలు తమతో సహకరించాలని పోలీస్ అధికారులు సూచించారు.
క్వార్టర్ బాటిల్.. కిలో చికెన్.. ఓటుకు నోటు
ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పలువురు అభ్యర్థులు బుధవారం రాత్రి నుంచే చీరలు, ఇతర విలువైన గిప్ట్‌లు పంపిణీ చేశారు. మరికొందరు క్వార్టర్ మందు, ఇంటికి కిలో చికెన్ అందజేశారు. తమకు ఓటు వేస్తారనుకునే వారి జాబితా సిద్ధం చేసుకుని ఒక్కో ఓటుకు ఏరియాను బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు నగదు పంచిపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ ముగిసేవరకు ప్రలోభపర్వం కొనసాగించి గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక
సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల ప్రత్యేక నిఘా
తొలివిడత పోలింగ్ స్వరూపం
పంచాయతీలు 99
ఏకగ్రీవం 04
పోలింగ్ జరిగేవి 95
సర్పంచ్ అభ్యర్ధులు 377
వార్డులు 896
ఏకగ్రీవం 211
ఎన్నికలు జరిగేవి 685
అభ్యర్థులు 1,880
పోలింగ్ కేంద్రాలు 896
పీవోలు 1,031
ఏపీవోలు 1,346
వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు 114
యంత్రాంగం.. సిద్ధం
యంత్రాంగం.. సిద్ధం
యంత్రాంగం.. సిద్ధం


