రెస్క్యూ పోటీల్లో సింగరేణి కీర్తిపతాక
గోదావరిఖని: జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి కీర్తిపతాకం ఎగురవేసింది. ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీప మాంగనీస్ ఓవర్‌సీస్(ఎంవోఐఎల్) ఆధ్వర్యంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్) మెయిన్‌రెస్క్యూస్టేషన్‌లో నిర్వహించిన పోటీల్లో సింగరేణి జ ట్టు ఓవరాల్ ప్రథమ స్థానం సాధించింది. దేశంలో ని మెటల్ మైన్, కోల్‌మైన్ టీంలు పోటీలకు హాజరయ్యాయి. సింగరేణి నుంచి రెండు పురుష, ఒక మహిళా రెస్క్యూ జట్టు పాల్గొన్నాయి. హోరాహోరీ పోటీల్లో 29 పురుష, ఏడు మహిళా బృందాలు తలపడ్డాయి. సింగరేణి పురుషుల బీ– టీం ఓవరాల్ ప్రథమ స్థానం సాధించింది. ఏ–టీం ఓవరాల్ నాలుగోస్థానం దక్కించుకుంది. తొలిసారి పోటీల్లో పాల్గొన్న సింగరేణి మహిళా రెస్క్యూ జట్టు ఓవరాల్‌రెండో స్థానం సాధించింది.
జాతీయ, అంతర్జాతీయంగానూ.
సింగరేణి జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో రెస్క్యూ పోటీల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలిండియాలోని అనేక రెస్క్యూ బృందాలకు శిక్షణ కూడా ఇచ్చింది. రెస్క్యూ, రికవరీ, థియరీ, ఫస్ట్‌ఎయిడ్, స్టాట్యుటరీ తదితర విభాగాల్లో సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టే షన్ లో జాతీయస్థాయి ప్రతినిధులకు 70రోజు ల పాటు ఇటీవల ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన విష యం కూడా తెలిసిందే. అత్యవసర సమయా ల్లో స్పందించే తీరుపై అవగాహన కల్పించింది.
హాజరైన 29 జట్లు
కోలిండియాకు చెందిన 29 జట్లు జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొన్నాయి. సింగరేణి జట్టు అగ్రస్థానంలో నిలిచింది. కోలిండియాలోని ఏడు మహిళా టీంలు పాల్గొనగా.. తొలిసారి హాజరైన సింగరేణి మహిళా జట్లు ఓవరాల్ రెండోస్థానం సాధించడం విశేషం.
11 ఏళ్లుగా ప్రథమ స్థానం
జాతీయ పోటీల్లో విజయకేతనం
ఓవరాల్ ఫస్ట్‌ప్లేస్‌లో బీ–టీం
నాలుగోస్థానంలో ఏ–టీం


