అన్నీ అసౌకర్యాలే.. | - | Sakshi
Sakshi News home page

అన్నీ అసౌకర్యాలే..

Dec 11 2025 7:24 AM | Updated on Dec 11 2025 7:24 AM

అన్నీ

అన్నీ అసౌకర్యాలే..

మంథని: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అ ధికారుల అలసత్వం కొట్టచ్చినట్లు కనిపించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూష న్‌ కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో ఎన్నికల సిబ్బంది నానాతంటాలు పడ్డా రు. తమకు కేటాయించిన కేంద్రానికి తరలి వెళ్లేముందు సామగ్రిని సరిచూసుకునేందుకు సౌకర్యాలు లేక కింద కూర్చుండిపోయారు. అలాగే రూట్‌ సిబ్బందిని తరలించేందురు సరిపడా వాహనాలు సమకూర్చలేదు. ఉన్నవాటిలోనే సిబ్బంది కిక్కిరిసి ప్రయాణం చేశారు.

క్రీడలతో ఆరోగ్యం

జ్యోతినగర్‌(రామగుండం): క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీపీసీ ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అ న్నారు. బుధవారం ఎన్టీపీసీ సచ్‌దేవ స్కూల్‌ ఆ ఫ్‌ ఎక్స్‌లెన్స్‌ వార్షిక క్రీడా దినోత్సవం జరిగింది. ఈడీ మాట్లాడుతూ, క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అ నంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి క కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ జ్ఞాన్‌చంద్‌, ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్‌)బిజయ్‌ కుమార్‌ సిగ్దర్‌, డిప్యూటీ మేనేజర్లు ఏకే సింగ్‌, కేవీఎంకే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నీటి సరఫరాపై అవగాహన

కోల్‌సిటీ(రామగుండం): నగరంలో తాగునీటి సరఫరా నిర్వహణపై ఈఈ రామన్‌ అవగాహన కల్పించారు. స్థానిక శారదానగర్‌ జలాశయం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో ఆయన వార్డు ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. నగరంలోని 13 ఉపరితల జలశయాల నుంచి సుమారు 40,500 నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. నీటిలో క్లోరిన్‌ పరీక్ష చేయడంపై అవగాహన కల్పించా రు. కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, నీటిసరఫరా సూపర్‌వైజర్‌ శశికుమార్‌ పాల్గొన్నారు.

టీబీ చాంపియన్లే కీలకం

కోల్‌సిటీ(రామగుండం): క్షయ నిర్మూలనలో టీ బీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ అన్నారు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన టీబీ చాంపియన్ల శిక్షణ శిబిరాన్ని బుధవారం డీఎంహెచ్‌వో ప్రారంభించి మాట్లాడారు. టీబీ బారినపడి కోలుకున్నవారిని టీబీ చాంపియన్‌లు అంటారని, వారి అనుభవాలను పంచుకోవడం ఎంతోముఖ్యమన్నారు. మందులు సక్రమంగా వాడి తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపా రు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, డీటీవో సుధాకర్‌రెడ్డి, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి సుధాకర్‌రెడ్డి, ఇంపాక్ట్‌ ఇండియా ప్రాజెక్ట్‌ స్టేట్‌ లీడ్‌ పురుషోత్తం, జిల్లా లీడ్‌ శ్రీనివాస్‌, ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ లక్ష్మీభవాని, ఆర్పీ అంజలి, గోపీకృష్ణ పాల్గొన్నారు.

పెరిగిన పత్తి ధర

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,435 ధర పలికింది. మంగళవారం క్వింటాల్‌కు రూ.7,361 ధర పలికిన పత్తి.. బుధవారం రూ.7,435కు చేరడం గమ నార్హం. కాగా, కనిష్టంగా రూ.6,861, సగటు ధ ర రూ.7,235గా నమోదైందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 144 మంది రైతులు తీసుకొచ్చిన 558 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

బీఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

పాలకుర్తి(రామగుండం): బీఆర్‌ఎస్‌ నాయకు లు వివిధ గ్రామాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. పాలకుర్తిలో ఆ పా ర్టీ బలపర్చిన మాదాసు స్వప్న–సతీశ్‌కు మద్దతుగా బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నీ అసౌకర్యాలే.. 
1
1/3

అన్నీ అసౌకర్యాలే..

అన్నీ అసౌకర్యాలే.. 
2
2/3

అన్నీ అసౌకర్యాలే..

అన్నీ అసౌకర్యాలే.. 
3
3/3

అన్నీ అసౌకర్యాలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement