ఓటేసేందుకు కాదు.. భోజనం కోసం బారులు
ఓటు వేయడం ఈరోజా? లేక రేపు ఉంటుందా? అని అక్కడి జనాలు నివ్వెరపోయేలా మధ్యాహ్న భోజనం కోసం ఎన్నికల సిబ్బంది బారులు తీరి కనిపించారు. అప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు ఒకరోజే ముందే వచ్చాయా? అని ఆశ్చర్యపోయిన వారికి అసలు విషయం తెలిశాక ఆశ్యర్యం వేసింది. కమాన్‌పూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయ్యాక మధ్యాహ్న భోజనం కోసం సిబ్బంది గంటల తరబడి ఇలా బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకూ నిరీక్షించక తప్పలేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


