లోపాలు తలెత్తకుండా చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో పారిశుధ్యం, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి సరఫ రా తదితర వసతుల కల్పనలో లోపాలు తలెత్తకుండా వార్డు ఆఫీసర్లు సమర్ధవంతంగా పర్యవేక్షించాలని కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం వార్డు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ని ర్ణీత సమయంలో తాగునీరు విడుదల చేయడం, లీకేజీ అరికట్టాలని, 15రోజులకోసారి వా టర్ ట్యాంకులు శుభ్రం చేసేలా పర్యవేక్షించాల ని అన్నారు. వీధిదీపాలు వెలిగేలా చూడాలని, కొత్త స్తంభాలకు లైట్లు బిగించాలని, ఆస్తిప న్ను, నల్లా బిల్లులు వసూలు చేయాలని సూ చించారు. ఇంకుడుగుంతల ఫొటోలు, నల్లా వినియోగదారుల వివరాలు ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయాలని అన్నారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఎన్‌ఎస్ 163 యాక్ట్ అమలు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎన్నిక లు సజావుగా నిర్వహించేందుకు 163 బీఎన్‌ఎస్ ఎ యాక్ట్ అమలు చేస్తు న్నామని సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవా రం తెలిపారు. పెద్దపల్లి జోన్‌లోని కాల్వశ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, మంథని, ము త్తారం, మంచిర్యాల జోన్‌లోని దండేపల్లి, జ న్నారం, లక్సెట్టిపేట మండలాల్లో తొలివిడత లో ఈనెల 11న పోలింగ్ జరుగుతుందన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకూ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల వాతావరణం దెబ్బతినేలా వ్య వహరిస్తే చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నా రు. ఊరేగింపులు, సమావేశాలు అనుమతిలేకుండా చేపట్టకూడదని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కమాన్‌పూర్(మంథని): స్థానిక జెడ్పీ హైస్కూ ల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలీస్ సి బ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ రమేశ్, టూటౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్సై ప్రసాద్, ఎంపీడీవో ప్రియాంక, ఎంపీవో తదితరులు ఉన్నారు.
పోలీసుల కవాతు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హై స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలం కావడంతో స్థానిక అంబేడ్కర్ చౌ రస్తాలో పోలీసుల కవాతు నిర్వహించారు. పో లింగ్‌కు పకడ్బందీ బందోబస్తు చేపడతామని ఆయన తెలిపారు. ఎస్సై వెంకటేశ్, ఏఎస్సై నీలిమ, సిబ్బంది ఉన్నారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
కమాన్‌పూర్(మంథని): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూచించారు. స్థానిక పీహెచ్‌సీని మంగళవారం ఆమె సందర్శించారు. కమాన్‌పూర్, బేగంపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లతో ప్రసవాలపై స మీక్షించారు. గర్భిణులు 102 వాహనాలను వి నియోగించుకోవాలని ఆమె సూచించారు. ప్రతీగ్రామంలో జ్వరాల సర్వే చేయాలని, శుక్రవారం డ్రైడే పాటించాలని అన్నారు. డాక్టర్లు రాజమౌళి, రవిసింగ్, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, సల్మాబేగం, ప్రదీప్, డేటా అధికారి మ హేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లోపాలు తలెత్తకుండా చర్యలు
లోపాలు తలెత్తకుండా చర్యలు
లోపాలు తలెత్తకుండా చర్యలు
లోపాలు తలెత్తకుండా చర్యలు


