అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో కంప్యూటర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ అప్రెంటిషిప్ కోసం దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. 2022, ఆ తర్వాత సంవత్సరంలో కంప్యూ టర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై, జిల్లాకు చెందిన వారే అర్హులు. ఈ నెల 1వ తేదీవరకు 18 ఏళ్లు నిండి, 24ఏళ్లకన్నా త క్కువ వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వ యసులో సడలింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్ లే దా తత్సమాన విద్యార్హతలు ఉండాలి. ఎన్‌సీవీటి ద్వారా గుర్తింపు పొందిన ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ – ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ ఉత్తీర్ణులు కా వాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడి/ఈడబ్ల్యూఎస్ లకు రిజర్వేషన్ మార్గదర్శకాలు పాటిస్తారు. ఎన్టీపీ సీ ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి, అర్హతగలవారు www.apprentic es hipindia.org పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. బయోడేటా ఫార్మాట్‌ను ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో సేకరించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను ఉద్యోగుల అభివృద్ధి కేంద్రంలోని డ్రాప్ బా క్స్‌లో వేయాలి. ఎస్సెస్సీ మెమో, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్, ఆధార్, కుల ధృవీకరణపత్రం, హార్డ్‌కాపీలతో జతచేయాలి. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు గేట్‌పాస్‌తోపాటు భూ నిర్వాసిత పత్రాలను జత చేయాలి. దరఖాస్తుల దాఖలుకు ఈనెల 22వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు వివరించారు.
రేపు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు
గోదావరిఖని: స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని పాస్టర్లు మహిపాల్‌రెడ్డి, ఐజయ్య, డిలై ట్, సాల్మన్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. నాయకులు జిమ్మిబాబు, శ్రీనివాస్, రవిపాల్, ప్రహర్షి, గాబ్రియల్, థామస్, గంట భబిత తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఆస్పత్రి తనిఖీ
గోదావరిఖని: రక్షణ కమిటీ బృందం మంగళవారం స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసింది. బృందం కన్వీనర్ డాక్టర్ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో పీఎంఈ సెక్షన్ ఉద్యోగుల రికార్డులను పరిశీలించింది. ప్రతిభ కనబరచిన సిబ్బందికి ప్రోత్సాహక బ హుమతులు అందజేసింది. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


